Crime News: పెళ్లి చేసుకుని.. ఇల్లు దోచేసింది
షణ్ముగం (69) అనే వృద్ధుడిని రెండో వివాహం చేసుకుంటానని నమ్మించిన మల్లిక అనే మహిళ చివరికి వంచనకు తెరలేపింది.
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: షణ్ముగం (69) అనే వృద్ధుడిని రెండో వివాహం చేసుకున్న మల్లిక అనే మహిళ చివరికి వంచనకు తెరలేపింది. కాటన్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఓటీసీ రోడ్డుకు చెందిన బాధితుడు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు. అతన్ని తమిళనాడుకు చెందిన మల్లిక అలియాస్ మల్లర్ (35) పరిచయం చేసుకుంది. తనను రెండో వివాహం చేసుకోవాలని కోరింది. అందుకు ఆయన అంగీకరించడంతో తమిళనాడు నుంచి తనకు పరిచయం ఉన్న ఇద్దరిని పిలిపించింది. షణ్ముగం ఇంట్లోనే జనవరి 4న వివాహం చేసుకున్నారు. ఆమెకు తోడుగా వచ్చిన వ్యక్తులు కమీషన్‌గా రూ.35 వేలు తీసుకుని వెళ్లిపోయారు. జనవరి పది వరకు షణ్ముగంతోనే కలిసి ఉన్న మల్లిక ఆ తర్వాత ఇంట్లోని 64 గ్రాముల ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులు, కొంత నగదు తీసుకుని పరారైంది. తన భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియక, పలు ప్రాంతాలలో ఆయన గాలించారు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించి కాటన్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
India News
Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత
-
Politics News
TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి
-
India News
the elephant whisperers: ఆస్కార్ లఘుచిత్ర దర్శకురాలికి రూ.కోటి నజరానా
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి