logo

అబ్బురపరచిన విదేశీయుల సాహస క్రీడలు

హంపీ ఉత్సవాల్లో శనివారం మాతంగకొండ వద్ద ఏర్పాటు చేసిన సాహస క్రీడలు అబ్బురపరిచాయి. మొదటిసారిగా ఉత్సవాల నిర్వాహకులు విదేశీయులకు కూడా రాక్‌ క్లైంబింగ్‌ పోటీలను ఏర్పాటు చేశారు.

Published : 29 Jan 2023 04:02 IST

కొండెక్కుతున్న విదేశీ వనిత, విదేశీయుడి విన్యాసం

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీ ఉత్సవాల్లో శనివారం మాతంగకొండ వద్ద ఏర్పాటు చేసిన సాహస క్రీడలు అబ్బురపరిచాయి. మొదటిసారిగా ఉత్సవాల నిర్వాహకులు విదేశీయులకు కూడా రాక్‌ క్లైంబింగ్‌ పోటీలను ఏర్పాటు చేశారు. పలు దేశస్థులు పోటీలో పాల్గొన్నారు. సాధారణ రోజుల్లో చాలామంది హంపీ, ఆనెగుంది ప్రాంతాల్లోని కొండలను ఎక్కుతుంటారు. వారిలోని ఆసక్తిని గమనించి ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల విభాగంలో ఆస్ట్రీయావాసి ప్యాట్రిసియ సన్ని ప్రథమం, ఇంగ్లండ్‌ గ్రేస్‌ ఇలియం ద్వితీయం, ఆస్ట్రీయ వాసి అనా లిండేర్‌ తృతీయ బహుమతి దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో మోవిలెస్‌ లేనార్‌(ఆస్ట్రీయా), ఇవాన్‌ అఫనాసేమ్‌(రష్యా), మోర్టిన్‌ శెమిడేర్‌(తృతీయ) బహుమతి దక్కించుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొన్నందుకు తమకెంతో ఆనందంగా ఉందని విదేశీయులు హర్షం వ్యక్తం చేశారు.

విజేతలకు బహుమతులు అందిస్తున్న నిర్వాహకులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు