logo

హోరాహోరీగా కుస్తీ పోటీలు

హంపీ ఉత్సవాల రెండో రోజు శనివారం కుస్తీ, గుండు ఎత్తే పోటీలు ఆర్భాటంగా జరిగాయి. యువజన సేవా, క్రీడాశాఖ మలపనగుడి పాఠశాల ఆవరణలో ఈ క్రీడలను ఏర్పాటు చేసింది.

Published : 29 Jan 2023 04:02 IST

గుండు ఎత్తే పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన విజయపురకు చెందిన శేఖరప్ప

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీ ఉత్సవాల రెండో రోజు శనివారం కుస్తీ, గుండు ఎత్తే పోటీలు ఆర్భాటంగా జరిగాయి. యువజన సేవా, క్రీడాశాఖ మలపనగుడి పాఠశాల ఆవరణలో ఈ క్రీడలను ఏర్పాటు చేసింది. కర్ణాటకలోని దావణగెరె, హుబ్బళ్లి, ధారవాడ, విజయపుర, హొసపేటె నుంచి సుమారు 72 మంది పహిల్వాన్లు కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో 16మంది మహిళలు ఉండటం ప్రత్యేకం. మంత్రి ఆనంద్‌సింగ్‌ తప్పెట వాయిద్యాన్ని కొట్టి పోటీలను ప్రారంభించారు. అదే విధంగా గుండు ఎత్తే పోటీలు పోటాపోటీగా సాగాయి. సుమారు 15 ఏళ్లు హంపీ ఉత్సవాల్లో మొదటి స్థానంలో నిలిచిన బాగలకోటె పహిల్వాన్‌ ఇబ్రహింసాబ్‌ను, విజయపుర పహిల్వాన్‌ శేఖరప్ప ఓడించాడు. శేఖరప్ప 3 నిమిషాల్లో 155 కిలోల గుండును ఎత్తగా, ఇబ్రహింసాబ్‌ ఆరు నిమిషాల్లో ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. 135 కిలోల గుండు ఎత్తడంతో స్థానిక పహిల్వాన్‌ ఆనంద్‌ తృతీయ స్థానంలో నిలిచాడు. కమలాపుర, హొసపేటె, కొండనాయకనహళ్లి, మలపనగుడి, అనంతశయనగుడి ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని