logo

లక్ష్యంతో ముందుకు వెళ్లాలి

ద్వితీయ పీయూసీ విద్యార్థులు పట్టుదల, ప్రణాళికతో ముందుకు వెళ్తే లక్ష్యం చేరుకుంటారని కె.ఎల్‌.యు (కోనేరు లక్ష్యయ్య విశ్వవిద్యాలయం విజయవాడ) సంస్థ నిర్దేశకులు డా.శ్రీనివాసరావు సూచించారు.

Published : 29 Jan 2023 04:02 IST

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డా.శ్రీనివాసరావు, బెస్ట్‌ కళాశాల కార్యదర్శి మన్నెం శ్రీనివాసులు, ప్రధాన ఆచార్యులు వెంకటేశ్వరరావ్‌ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: ద్వితీయ పీయూసీ విద్యార్థులు పట్టుదల, ప్రణాళికతో ముందుకు వెళ్తే లక్ష్యం చేరుకుంటారని కె.ఎల్‌.యు (కోనేరు లక్ష్యయ్య విశ్వవిద్యాలయం విజయవాడ) సంస్థ నిర్దేశకులు డా.శ్రీనివాసరావు సూచించారు. బళ్లారి స్వతంత్ర పదవీ పూర్వ కళాశాల (బెస్ట్‌)లో శనివారం ఏర్పాటు చేసిన కెరియర్‌ కౌన్సిలింగ్‌, చర్చ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ద్వితీయ పీయూసీ తర్వాత కేవలం వృత్తిపర కోర్సులైన ఇంజినీరింగ్‌, వైద్య కోర్సులే కాకుండా వేర్వేరు కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల్లో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని వివరించారు. పరీక్షల సమయంలో గురువుల మార్గదర్శనంలో ముందుకు వెళ్లాలన్నారు. కె.ఎల్‌.యు. సంస్థ కార్యదర్శి శ్రీనివాసులు, బెస్ట్‌ కళాశాల కార్యదర్శి మన్నెం శ్రీనివాసులు, ప్రధాన ఆచార్యులు వెంకటేశ్వరరావ్‌, ఉప ఆచార్యులు జి.శ్రీనివాసరెడ్డిలు మాట్లాడారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  చర్చ కార్యక్రమంలో 1,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని