సాంకేతికతకు మరింత మెరుగు
ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వివరించారు. పదేళ్ల కిందట సైబర్ నేరాలంటే ఎక్కువ మందికి తెలియదని, ప్రస్తుతం పలువురు ఈ నేరగాళ్ల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌షా
ధార్వాడ, న్యూస్‌టుడే : ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వివరించారు. పదేళ్ల కిందట సైబర్ నేరాలంటే ఎక్కువ మందికి తెలియదని, ప్రస్తుతం పలువురు ఈ నేరగాళ్ల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త తరహా నేరాలను అడ్డుకునేందుకు మన సాంకేతికతను మరింత అభివృద్ధిపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, ప్రహ్లాద్ జోషి, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్ తదితరులతో కలిసి ధార్వాడలో కర్ణాటక ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం భూమి పూజలో శనివారం బొమ్మై పాల్గొని మాట్లాడారు. సైబర్ క్రైమ్, డిజిటల్ క్రైమ్, నార్కోటిక్స్‌లను నియంత్రించవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి నేరం ఒక కొత్త చట్టాన్ని తయారు చేసేందుకు అవకాశం కల్పిస్తుందన్నట్లు సైబర్ నేరాల నియంత్రణకు కేంద్రం ఇప్పటికే పలు చట్టాలు చేసిందని గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న చట్టాలు, సాంకేతికతతో నేరాలు, నేరగాళ్లను గుర్తించేందుకు ఫోరెన్సిక్స్ ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయం అవసరం ఏర్పడిందన్నారు. తాను హోం మంత్రిగా ఉన్న సమయంలో రెండు ప్రాంతీయ ఫోరెన్సిక్ ప్రయోగశాలల ఏర్పాటు, బెంగళూరులోని కేంద్రాన్ని రూ.30 కోట్లతో ఉన్నతీకరించామని చెప్పారు. విదేశాలలో తరరహా భారతదేశంలో మొదటిసారిగా కర్ణాటకలోనే 180 మందికి పైగా నిపుణులను ‘స్పెషల్ ఆఫీసర్ ఆన్ క్రైం సీన్’ పేరిట నియమించుకున్నామని, వారికి సహకరించే 52 మంది ఫోరెన్సిక్ నిపుణులను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. కర్ణాటకపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ప్రత్యేక అభిమానం ఉండడంతోనే ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం పలికారని పేర్కొన్నారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులకూ ఈ విశ్వవిద్యాలయ సహకారాన్ని, సేవలు అందిస్తుందని చెప్పారు. ఉప కులపతి జీఎం వ్యాస్, ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లద్, అమృత్ దేశాయి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం ప్రారంభ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు
రాష్ట్ర ప్రగతి కొత్త పుంతలు
హోంమంత్రికి స్మరణిక అందిస్తున్న సంస్థ ప్రతినిధులు
హుబ్బళ్లి, న్యూస్‌టుడే : కర్ణాటక ప్రగతిపర రాష్ట్రమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటకను మరింత ముందంజలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. పలు రంగాలలో ఇతర రాష్ట్రాలకు కర్ణాటక ఆదర్శంగా ఉందని చెప్పారు. కేఎల్‌ఈ సంస్థ బీవీ భూమరెడ్డి ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయం సువర్ణ మహోత్సవాలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి విద్యా సంస్థలకు వచ్చినప్పుడు తాను మరోసారి విద్యార్థి కావాలని అనిపిస్తుందని బొమ్మై అన్నారు. తాను చదువుకునే రోజులలో ఇక్కడ కేవలం మూడు సెక్షన్లు మాత్రమే ఉండేవని, క్యాంటిన్ తనకు ఇష్టమైన ప్రదేశమని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని తెలిపారు. స్వాతంత్య్ర అమృతమహోత్సవాలను నిర్వహించుకున్న భారతదేశం రానున్న పాతికేళ్లలో ఉత్తుంగ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ కళాశాల, కేఎల్‌ఈ సంస్థలు నవ భారత నిర్మాణంలో కీలక పాత్రను పోషించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏ రాష్ట్రమైనా విద్యా పరంగా ముందంజలోకి వస్తేనే ఆర్థిక సాధికారతను సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందని తెలిపారు. మొదటి సెమీ కండక్టర్, ఆర్ అండ్ డి విధానాలను కర్ణాటకలో తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఉపాధి అవకాశాలను కల్పించే వారికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించామని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్‌షా కర్ణాటకలో మహిళల రక్షణ కోసం రూ.700 కోట్లు, బెంగళూరు నగరాభివృద్ధికి రూ.450 కోట్లు కేటాయించారని చెప్పారు. సహకార రంగంలోనూ ఉత్తమ ప్రగతి సాధించేందుకు షా అందిస్తున్న సహకారం అమూల్యమని కొనియాడారు.
కేఎల్‌ఈ సంస్థ ప్రాంగణంలో జ్యోతి వెలిగిస్తున్న అమిత్‌షా
* ముఖ్యమంత్రి బొమ్మై పుట్టిన రోజును దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ విద్యార్థులు తమకు పార్టీ ఇవ్వాలని సీఎంను కోరారు. తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే పార్టీ, పార్టీ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ‘పార్టీ ఇద్దాం’ అని చెప్పి, ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, జగదీశ్ శెట్టర్, మంత్రులు మురుగేశ్ నిరాణి, శంకర పాటిల మునేనకొప్ప, కేఎల్‌ఈ సంస్థ కార్యాధ్యక్షుడు ప్రభాకర్ కోరే తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని