logo

ఉపాధ్యాయుడి నిజాయితీ

రహదారిపై తప్పిపోయిన నగదు సంచిని ఓ ఉపాధ్యాయుడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తప్పిపోయిన వ్యక్తికి అందజేసిన ఘటన బళ్లారి నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 30 Jan 2023 02:25 IST

పోలీస్‌ సమక్షంలో విజయకు నగదు అందజేస్తున్న ఉపాధ్యాయుడు సక్లేస్‌బాషా

బళ్లారి, న్యూస్‌టుడే: రహదారిపై తప్పిపోయిన నగదు సంచిని ఓ ఉపాధ్యాయుడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తప్పిపోయిన వ్యక్తికి అందజేసిన ఘటన బళ్లారి నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ సరళాదేవి సతీశ్చంద్ర డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సుజాత భర్త విజయకు బళ్లారి గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న డా.రాజ్‌కుమార్‌ రహదారి మెడికల్‌ ఏజెన్సీ ఉంది. రెండు రోజులు ముందు (శుక్రవారం) మధ్యాహ్నం సంచిలో రూ.2.20లక్షల నగదును పెట్టుకుని ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో ప్రభుత్వ అతిథి భవనం - ఎం.జి. మధ్యలో సంచి పడిపోయింది. వెనుక బస్సులో వెళ్తున్న ఓ స్నేహితుడు ఉమాకంత్‌ గుర్తించి వెంటనే విజయకు చరవాణికి ఫోన్‌ చేసి విషయం తెలియజేశాడు. గుర్తించిన విజయ రహదారిలో పడిన ప్రాంతాన్ని వెతికినా ఎక్కడా నగదు ఉన్న సంచి కనిపించలేదు. వెంటనే గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని సమాచారం తెలియజేయగా, ఘటన స్థలం బ్రూస్‌పేటె పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తోంది. అక్కడ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. విజయతో పాటు సతీమణి సుజాత బ్రూస్‌పేటె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే నగదుతో ఉన్న సంచి తీసుకున్న శ్రీరాంపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సక్లేస్‌బాషా.. స్నేహితుడు సాయంతో బ్రూస్‌పేటె పోలీసులకు అప్పగించారు. అదేసమయంలో పోలీస్‌స్టేషన్‌లో ఉన్న విజయ, సుజాతలు తమదే నగదు సంచి అని చెప్పారు. పోలీసులు విచారించి సంచి అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని