logo

బ్యాంకు మేనేజరు అరెస్టు

వినియోగదారుల దృష్టికి రాకుండా వారి ఖాతాల్లో ఉన్న రూ.4.92కోట్లు నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేసి ఎల్‌ఐసీ బాండ్‌లను కొనుగోలు చేసి మోసగించాడనే ఆరోపణపై ఐడీబీఐ బ్యాంకు మేనేజరు సచీలా(34)ను సంపంగిరామనగర పోలీసులు అరెస్టు చేశారు.

Published : 30 Jan 2023 02:25 IST

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: వినియోగదారుల దృష్టికి రాకుండా వారి ఖాతాల్లో ఉన్న రూ.4.92కోట్లు నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేసి ఎల్‌ఐసీ బాండ్‌లను కొనుగోలు చేసి మోసగించాడనే ఆరోపణపై ఐడీబీఐ బ్యాంకు మేనేజరు సచీలా(34)ను సంపంగిరామనగర పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తమిళనాడు కన్యాకుమారి నివాసి. భారతీనగరలో నివసిస్తున్నారు. మిషన్‌ రోడ్డులో బ్యాంకు బ్రాంచిలో పని చేస్తున్నారు. కంప్యూటర్‌, రూ.23లక్షల బాండ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐడీబీఐ శాఖలో రిలేషన్‌ మేనేజరుగా 2022 జూన్‌ 13 నుంచి డిసెంబరు 31 వరకు పని చేశారు. ఆ సమయంలో వినియోగదారుల ఖాతాలకు కన్నం వేసి నగదు డ్రా చేసి ఎల్‌ఐసీ బాండ్‌లను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 23 డిసెంబరు 2022న గాంధీనగర శాఖలో ఒకే రోజు రూ.4.92 కోట్ల నగదు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసి మోసగించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని