logo

సర్కారుతో అంగన్‌వాఢీ

అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన అంతకంతకూ తీవ్రమవుతోంది. సీఐటీయూతో పాటు వివిధ సంఘాలు వారికి మద్దతుగా నిలుస్తున్నాయి.

Published : 01 Feb 2023 01:02 IST

బెంగళూరు స్వాతంత్య్ర ఉద్యానవనంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల ఉద్యమపథం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన అంతకంతకూ తీవ్రమవుతోంది. సీఐటీయూతో పాటు వివిధ సంఘాలు వారికి మద్దతుగా నిలుస్తున్నాయి. బెంగళూరు స్వాతంత్య్ర ఉద్యానవనం కేంద్రంగా మంగళవారానికి ఈ ఆందోళన పదో రోజుకు చేరుకుంది. అదే సమయంలో ఉద్యమకారుల ఇక్కట్లు ఎక్కువవుతున్నాయి. రాత్రింపగళ్లూ వారు చలికి నడివీధిలో వణికిపోతున్నారు. అక్కడే ధర్నా.. ఆ పక్కనే నిద్ర.. అన్నపానీయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలబోమని ఉద్యమకారులు హెచ్చరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలను సహాయ ఉపాధ్యాయులుగా గుర్తించాలని, వేతనాలు పెంచాలని, వైద్య బీమా వర్తింపజేయాలనేవి ప్రధాన డిమాండ్లు. మంత్రి హాలప్ప ఆచార్‌ సోమవారం రాత్రి ఈ శిబిరాన్ని సందర్శించిన స్పష్టమైన హామీలివ్వక పోవడంతో ఆంళన కొనసాగుతోంది. రహదారులపైనే విశ్రమిస్తున్న వారికి జలమండలి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తోంది. వివిధ సంఘాల కార్యకర్తలు వారికి భోజనం అందజేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడం పెద్ద సమస్యగా మారడంతో సంచార మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని