logo

భాజపాలో సిద్ధుకు చోటివ్వం

తాను జీవించి ఉన్నంత వరకు భాజపాలో చేరను అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఈశ్వరప్ప బదులిచ్చారు.

Published : 01 Feb 2023 01:02 IST

ఈశ్వరప్ప

శివమొగ్గ, న్యూస్‌టుడే : తాను జీవించి ఉన్నంత వరకు భాజపాలో చేరను అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఈశ్వరప్ప బదులిచ్చారు. ‘మీరు జీవించి ఉన్నప్పుడే భాజపాలో చేర్చుకోం’ అంటూ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఆయన చనిపోతే మా పార్టీలో చేర్చుకునే అవసరం ఏముంది?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. ‘సిద్ధు నుదుటి రాతను ఓటర్లు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఆయన ఎవరికీ నమ్మకస్తుడు కాదు. ఇకపై ఆయన తీరు కూడా మారదు. వచ్చే ఎన్నికలలో ఓడిపోతారనే భయంతో బాదామి వదలి కొత్త నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారు’ అని విమర్శించారు. లోక్‌సభ సభ్యురాలు సుమలత భాజపాలో చేరుతుందని వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఈ విషయాన్ని పార్టీ జాతీయ నాయకులు చూసుకుంటారని చెప్పారు. కర్ణాటకలో భాజపా మినహా మరో పార్టీ అధికారంలోకి రాదని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి చేసిన ఆరోపణలకు డీకేశీ ఇప్పటి వరకు బదులివ్వలేదని గుర్తు చేశారు. శివకుమార్‌ ఇచ్చే సమాధానానికి అనుగుణంగా తాను స్పందిస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని