logo

సీఎంతో రమేశ్‌ మంతనాలు

కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్‌రాకెట్‌ సీడీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి (భాజపా) డిమాండు చేశారు.

Published : 01 Feb 2023 01:02 IST

రమేశ్‌ జార్ఖిహొళి

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్‌రాకెట్‌ సీడీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి (భాజపా) డిమాండు చేశారు. ఆయన మంగళవారం బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైని కలిసి ఈ విషయం చర్చించారు. ‘నా ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కుట్ర జరుగుతోంది’ అంటూ ఆక్రోశించారు. ఈ సందర్భంగా జార్ఖిహొళి విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వద్ద 120 సీడీలు ఉన్నాయని, దాన్ని అడ్డుపెట్టుకుని అందరినీ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. సదాశివనగరలోని తన నివాసానికి వచ్చినప్పుడు డీకే అభిమానులు జార్ఖిహొళిని ఘెరావ్‌ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని వ్యానులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. ఇదే ఘటనను రమేశ్‌ సోదరుడు లఖన్‌ జార్ఖిహొళి ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గూండాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తమ జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యే విషకన్య మాత్రమే కాదని అందరినీ మఠాష్‌ చేసే కన్య అని విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని