logo

హంపీ ఉత్సవాలకు సొబగు..ధ్వని-వెలుగు

హంపీ ఉత్సవాల్లో చివరి భాగం ధ్వని, వెలుగు కార్యక్రమం 2న ముగియనుంది. గత నెల 26 నుంచి హంపీ పరిధిలోని గజశాలలో సుమారు 110 మంది కళాకారులతో ధ్వని, వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Published : 01 Feb 2023 01:02 IST

ధ్వని,వెలుగు కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయల దర్బార్‌

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీ ఉత్సవాల్లో చివరి భాగం ధ్వని, వెలుగు కార్యక్రమం 2న ముగియనుంది. గత నెల 26 నుంచి హంపీ పరిధిలోని గజశాలలో సుమారు 110 మంది కళాకారులతో ధ్వని, వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికోసం 8 ప్రత్యేక వేదికలను నిర్మించారు. స్థానిక, స్థానికేతర కళాకారులకు అవకాశం కల్పించారు. విజయనగర వైభవం పేరిట ధ్వని,వెలుగు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. హంపీ ఉత్సవాల్లో ఈ కార్యక్రమమే ప్రధాన ఆకర్షణ. కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. అంతటి ప్రేక్షకాదరణ పొందినందుకే ప్రతి హంపీ ఉత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు ప్రోత్సాహక ధనం కూడా అందిస్తారు. ఏటా ఈ కార్యక్రమానికి రూ.50లక్షలదాకా ఖర్చవుతుంది. విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావానికి కారణమైన పరిస్థితులు, హక్క,బుక్కల పాలన. అనంతరం వచ్చిన రాజులు ప్రౌఢదేవరాయ, ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయల పాలన దృశ్యాలను ఇక్కడ కళాకారులు అభినయిస్తున్నారు. విజయనగర సామ్రాజ్య పతనం వరకు కథ సాగుతుంది. కళాకారులెవరూ ఇక్కడ సంభాషణలు చెప్పరు. నేపథ్యసంభాషణ ఉంటుంది. దానికి తగ్గట్టు కళాకారులు అభినయిస్తారు. ఏ వేదికపైన కళాకారులు అభినయిస్తుంటారో ఆ వేదికపైన మాత్రం వెలుగు ఉంటుంది. అందుకోసమే ఈ కార్యక్రమానికి ధ్వని,వెలుగు అని పేరుపెట్టారు. 2వ తేదీ చివరి ప్రదర్శన ఉంటుంది. సాయంత్రం 7.30నుంచి రాత్రి 9.30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీకృష్ణదేవరాయ దంపతులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని