logo

అదే ఆఖరి పయనం

జీవితంలో ఒక్కసారైనా రైలెక్కని ఆ యువకుడికి అదే చివరి ప్రయాణమవుతుందని తెలియదు పాపం. ఇంజినీర్‌గా ఉజ్వల భవిష్యత్తు ఉన్న అతన్ని రైలు పయనం రూపంలోనే మృత్యువు కబళించడం విషాదకరం.

Published : 03 Feb 2023 02:33 IST

రైలుకింద పడి ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

జీవితంలో ఒక్కసారైనా రైలెక్కని ఆ యువకుడికి అదే చివరి ప్రయాణమవుతుందని తెలియదు పాపం. ఇంజినీర్‌గా ఉజ్వల భవిష్యత్తు ఉన్న అతన్ని రైలు పయనం రూపంలోనే మృత్యువు కబళించడం విషాదకరం. కంటతడి పెట్టించిన ఈఘటన బళ్లారి రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది.

బళ్లారి, న్యూస్‌టుడే: రైలు దిగుతున్న సమయంలో కాలు జారి కిందపడి ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన గురువారం ఉదయం బళ్లారి నగరంలో జరిగింది. మృతిచెందిన విద్యార్థి హరీష్‌గౌడ(19)గా గుర్తించారు. కంప్లి తాలూకా రామసముద్రం గ్రామానికి చెందిన అమరగౌడ కుమారుడు హరీష్‌గౌడ బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి ఏడాది ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. హరిష్‌గౌడ జీవితంలో ఒక్కసారి కూడా రైలు ఎక్కలేదు. స్నేహితుల జతలో బుధవారం రాత్రి బెంగళూరు నుంచి బళ్లారికి హంపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బయలుదేరాడు. నిద్రలో ఉండగా బళ్లారి రైల్వే స్టేషన్‌ దాటి ముందుకు వెళ్లిన తర్వాత హరీష్‌గౌడ గుర్తించాడు. బళ్లారి కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రైలు వేగం తగ్గించడంతో కిందకు దిగడానికి ప్రయత్నం చేసి కాలు జారి కిందపడి ఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విమ్స్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు విమ్స్‌కు చేరుకుని కుమారుడు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు