logo

అన్నదమ్ముల విషాదాంతం

కాలు జారి వాగులో పడి ఇద్దరు సోదరులు మృతి చెందిన విషాద ఘటన గురువారం కురుగోడు తాలూకాలో జరిగింది. మృతులను తాలూకాలోని గుత్తిగనూరు గ్రామానికి చెందిన మణికంఠ(14) హర్షవర్ధన్‌(9)గా గుర్తించారు.

Published : 03 Feb 2023 02:39 IST

బళ్లారి, న్యూస్‌టుడే: కాలు జారి వాగులో పడి ఇద్దరు సోదరులు మృతి చెందిన విషాద ఘటన గురువారం కురుగోడు తాలూకాలో జరిగింది. మృతులను తాలూకాలోని గుత్తిగనూరు గ్రామానికి చెందిన మణికంఠ(14) హర్షవర్ధన్‌(9)గా గుర్తించారు. గుత్తిగనూరు గ్రామానికి చెందిన మల్లికార్జునకు ముగ్గురు కుమారులు మణికంఠ, హర్షవర్ధన్‌, మరొకరు ఉన్నారు. వారిలో ఒకరు బైలూరు, మరొకరు బళ్లారిలో విద్యాభ్యాసం చేస్తున్నారు. గ్రామంలో జరిగే అంబాదేవి జాతరకు వచ్చారు. గురువారం ఉదయం మణికంఠ, హర్షవర్ధన్‌ గ్రామ సమీపంలో బహిర్భమికి వెళ్లారు. అక్కడే ఉన్న వాగు వద్దకు వెళ్లగా కాలు జారి నీటిలో మునిగి మృతిచెందారు. కుమారులు ఎంత సేపటికీ ఇంటికి రాక పోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వాగు వద్దకు చేరుకుని పరిశీలించిగా వాగు వద్ద చెప్పులు కనిపించాయి. ఇద్దరూ కాలు జారి వాగులో పడి మృతిచెందుంటారని ప్రాథమికంగా గుర్తించి కురుగోడు పోలీసుల సహకారంలో వాగులో వెతికారు. చివరికి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు సోదరులు మృతిచెందడంపై గ్రామంలో విషాదఛాయులు అలుముకున్నాయి. కొన్ని క్షణాలు వరకు కళ్ల ఎదురుగా తిరుగుతున్న ఇద్దరూ నీటిలో మునిగి మృతిచెందారని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కురుగోడు పోలీసులు మృతదేహాలను పరిశీలించి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యుడు గణేష్‌ గుత్తిగనూరు గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. అక్కడి నుంచి మృతదేహాలను తన వాహనంలో ఆసుపత్రికి తరలించి, శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించే వరకు ఆసుపత్రి వద్ద ఉండిపోయారు.

మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్న శాసనసభ్యుడు గణేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు