అధైర్యపడకండి.. అండగా ఉంటాం
మతఛాందసవాదులు తమ పార్టీ కార్యకర్తలను బెదిరించి, కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా పార్టీ అభివృద్ధికి పనిచేయాలని గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర భరోసా ఇచ్చారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తున్న శాసనసభ్యుడు బి.నాగేంద్ర, మేయర్ మోదపల్లి రాజేశ్వరి, తదితరులు
బళ్లారి, న్యూస్‌టుడే: మతఛాందసవాదులు తమ పార్టీ కార్యకర్తలను బెదిరించి, కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా పార్టీ అభివృద్ధికి పనిచేయాలని గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర భరోసా ఇచ్చారు. నగర పాలికె 26వ వార్డు గడంగ్ వీధిలోని పాత ఉపాధి కార్యాలయం ఎదుట రూ.10 లక్షలతో తాగునీటి గొట్టాల పనులకు మేయర్ మోదపల్లి రాజేశ్వరితో కలిసి ఆయన భూమిపూజ చేశారు. పార్టీలోకి చేర్చుకోవడానికి పలు విధాలుగా ఆశలు చూపించే అవకాశం ఉంది. మీకు నేను అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కౌల్‌బజార్ ప్రాంతంతో పాటు, గ్రామీణ విధానసభ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప మేయర్ మాలన్ బీ, కార్పొరేటర్లు సుకుం బీ, జానకమ్మ, జబ్బర్, పార్టీ నేతలు సుబ్బరాయుడు, రవికుమార్, నాగలచెరువు గోవింద, అయాజ్, జగన్నాథ్, శివరాజ్, సోము, అల్లాబకష్, అక్బర్, సీనా, లోకేశ్, నాజు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..