logo

వినువీధుల్లో తేజస్‌ మెరుపు!

ఏరో ఇండియా-2023లో భారతీయ పెవిలియన్‌లో ప్రత్యేక ఆకర్షణగా తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను ప్రదర్శించనున్నారు.

Published : 03 Feb 2023 02:39 IST

ఈసారి పెవిలియన్‌లో ఇదే ఆకర్షణ

దేశీయ విమానాల విన్యాసాలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఏరో ఇండియా-2023లో భారతీయ పెవిలియన్‌లో ప్రత్యేక ఆకర్షణగా తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను ప్రదర్శించనున్నారు. విమానంతో పాటు సిమ్యులేటర్లు, విమానానికి సంబంధించిన వివిధ విభాగాల నమూనాలను ప్రదర్శనకు ఉంచుతామని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఒకే ఇంజిన్‌, డెల్టా వింగ్‌తో, తక్కువ బరువు, ఎక్కువ వేగంతో ప్రయాణించే సూపర్‌ సోనిక్‌ యుద్ధ విమానం భారతదేశ రక్షణ శాఖ అమ్ములపొదిలో శక్తివంతమైన వాహనమని అధికారులు పేర్కొన్నారు. ‘ఏ రన్‌వే టూ బిలియన్‌ ఆపర్చ్యునిటీస్‌’ పేరిట నిర్వహిస్తున్న 14వ ఎడిషన్‌ ఏరో ఇండియా-2023 ప్రదర్శన ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు కొనసాగనుంది. ఏరో డిస్‌ప్లే విభాగంలో విమానాలు, వాటి ప్రదర్శనలను వీక్షించేందుకు సాధారణ పౌరులు ఆన్‌లైన్‌లో రూ.1000 చెల్లించి టిక్కెట్టు కొనుగోలు చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని