logo

పాలనా సంస్కరణలకు ఊతం

రాష్ట్రంలో రక్తహీనతతో బాధపడే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారానికి రెండు గుడ్లకు బదులుగా ఐదు ఇవ్వాలని కర్ణాటక పాలన సంస్కరణల కమిషన్‌ సిఫార్సు చేసింది.

Published : 04 Feb 2023 01:39 IST

నివేదిక అందుకుంటున్న బొమ్మై  

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలో రక్తహీనతతో బాధపడే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారానికి రెండు గుడ్లకు బదులుగా ఐదు ఇవ్వాలని కర్ణాటక పాలన సంస్కరణల కమిషన్‌ సిఫార్సు చేసింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టి.ఎం.విజయభాస్కర్‌ అధ్యక్షులుగా ఉన్న ఏకసభ్య కమిషన్‌ ఈ నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి సమర్పించింది. మొత్తం 1,609 సలహాలను రాష్ట్రవ్యాప్తంగా సమీకరించిన ఈ నివేదికలో ఆరోగ్య, విద్యా సంబంధ అంశాలపై 17 సిఫార్సులు చేసింది. ఆ వివరాలు..

* రాష్ట్ర వ్యాప్తంగా అధిక, స్వల్ప స్థాయి రక్తహీనత ఉన్న ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు వారానికి ఐదు గుడ్లు ఇవ్వాలి. ఈ పథకంతో పిల్లల బడులు మానే పరిస్థితిని నివారించే వీలుంది. బాడుగ భవనాల్లో ఉండే 6,037 అంగన్‌వాడీ కేంద్రాలను దగ్గరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం, కర్ణాటక పబ్లిక్‌ స్కూళ్లలో పీయూ చదువులు కొనసాగించాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో చదివే విద్యార్థుల్లో 51 శాతం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులుండగా, కేవలం 3.45 శాతం మాత్రమే గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులున్నారు. వైద్య విద్యను అందరికీ అందించాలంటే స్థానిక విద్యార్థులకు ఉన్న 15 శాతం కోటా మొత్తం గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేటాయించాలని కమిషన్‌ సూచించింది. గ్రామాల్లో శిశు, బాలింత మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు సేవలపై నిషేధం, ప్రతి ఓపీడీలో ఒక ఎంబీబీఎస్‌ వైద్యులు, నర్సు, ప్యారామెడికల్‌ సిబ్బంది నియమించాలని ప్రతిపాదించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని