logo

మంత్రి పదవి నాకేల?

ఇక నాకు మంత్రి పదవి అవసరం లేదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి చెప్పానని మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప వైరాగ్య ప్రకటన చేశారు.

Published : 04 Feb 2023 01:39 IST

ఈశ్వరప్ప వైరాగ్యపథం

ఈశ్వరప్ప

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఇక నాకు మంత్రి పదవి అవసరం లేదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి చెప్పానని మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప వైరాగ్య ప్రకటన చేశారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ చేపడితే.. నాకు మంత్రిగా అవకాశం ఇవ్వవద్దని సీఎంకు స్పష్టం చేశానన్నారు. విస్తరణ ఎందుకు జాప్యం జరుగుతుందో తనకు అర్థం కాలేదన్నారు. విస్తరణ చేపట్టినా కేవలం రెండు నెలలు మాత్రమే మంత్రిగా ఉండేందుకు అవకాశం దక్కుతుందని విచారం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే దర్యాప్తునకు అడ్డు కాకూడదని తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేశానని, నిరపరాధిగా న్యాయస్థానం గుర్తించిన తర్వాత మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరానని గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడు తీహార్‌ జైలుకు వెళ్లి వచ్చారని, ఆయన తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని