logo

డీకేతో సుదీప్‌ చర్చలు

ప్రముఖ సినీనటుడు సుదీప్‌ శుక్రవారం బెంగళూరులో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది.

Published : 04 Feb 2023 01:39 IST

డీకే శివకుమార్‌ను కలిసిన సినీ నటుడు సుదీప్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహ్మద్‌ నలపాడ్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ప్రముఖ సినీనటుడు సుదీప్‌ శుక్రవారం బెంగళూరులో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఆయనతో పాటు యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహ్మద్‌ నలపాడ్‌ చర్చల్లో పాల్గొన్నారు. వివిధ అంశాలను అర్ధగంట పాటు వారు చర్చించారు. సుదీప్‌ కాంగ్రెస్‌లో చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికిప్పుడు డీకేతో చర్చించడంతో ఆ ప్రచారానికి బలమొచ్చింది. నిజానికి కాంగ్రెస్‌, భాజపా నేతలతో ఆయనకు చక్కని సంబంధాలు ఉన్నాయని, ఆ క్రమంలోనే డీకేని కలిశారు తప్ప మరేమీ కాదని ‘కిచ్చ’ అభిమానులు వివరించారు. ఎన్నికల ప్రచారానికి సహకరించాలని సుదీప్‌ను డీకే కోరారనేది మరో సమాచారం. చర్చల సారాంశమేమిటో ఆ ఇద్దరూ వెల్లడించక పోవడం ప్రస్తావనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని