ట్రాఫిక్‌లో అంబులెన్స్.. ఊపిరొదిలిన చిన్నారి
చికిత్స కోసం హాసన నుంచి నగరానికి అంబులెన్స్‌లో ఓ చిన్నారిని తరలించేవేళ విషాదం చోటుచేసుకుంది.
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చికిత్స కోసం హాసన నుంచి నగరానికి అంబులెన్స్‌లో ఓ చిన్నారిని తరలించేవేళ విషాదం చోటుచేసుకుంది. నగర శివార్ల నుంచి గంటల తరబడి ట్రాఫిక్ రద్దీలో ఆ వాహనం చిక్కుకుపోయింది. చివరికి ఆస్పత్రికి చేరేలోగా చిన్నారి కన్నుమూసిన ఘటన శుక్రవారం ఇక్కడ గూరగుంటపాళ్య వద్ద చోటుచేసుకుంది. హసన నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన అంబులెన్స్ గంటలోపే నగర శివారు నెలమంగలకు చేరుకుంది. ఇక అర్ధగంటలో ఇక్కడి ఓ ప్రముఖ ఆసుపత్రికి చేరాలనేది లక్ష్యం. అక్కడి నుంచి ట్రాఫిక్ ఇక్కట్లు మొదలయ్యాయి. గూరగుంటపాళ్య కూడలిలో 20 నిమిషాలపాటు రద్దీలో ఆ వాహనం ఆగిపోయిన సమయంలో పసిబిడ్డ (2) కన్నుమూసింది. కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగిపోయారు. మృతదేహాన్ని అదే అంబులెన్స్‌లో తిరిగి హసనకు తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: వ్యక్తిగత డేటా చోరీ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు
-
India News
Tamil Nadu: తమిళనాట ‘పెరుగు’ వివాదం.. పేరు మార్పుపై రగడ
-
India News
Toll tax : ఏంటీ టోల్ ట్యాక్స్.. ఎందుకు చెల్లించాలి!
-
Movies News
OTT Movies: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు/సిరీస్‌లివే
-
India News
Indigo: మద్యం తాగి విమానంలో వాంతులు.. టాయిలెట్ వద్ద మలవిసర్జన
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల లిస్ట్ చూశారా..?