logo

భారత్‌కు విశ్వగురువు స్థానం ఖాయం

మన దేశాన్ని విశ్వగురువు స్థానంలో చూసేందుకు రాబోయే రోజుల్లో ప్రజలు ప్రభుత్వాలకు సహకారం అందివ్వాలని గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ పిలుపునిచ్చారు.

Published : 06 Feb 2023 01:32 IST

కొట్టూరులో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన తరళుబాళు పౌర్ణమి ఉత్సవాల్లో ప్రసంగిస్తున్న గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌

హొసపేటె: మన దేశాన్ని విశ్వగురువు స్థానంలో చూసేందుకు రాబోయే రోజుల్లో ప్రజలు ప్రభుత్వాలకు సహకారం అందివ్వాలని గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ పిలుపునిచ్చారు. చిత్రదుర్గం తరళుబాళు మఠం ఆధ్వర్యంలో విజయనగర జిల్లా కొట్టూరులో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన తరళుబాళు పౌర్ణమి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే చాలా దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను అమితంగా గౌరవిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మన దేశం విశ్వగురువు కావడంతో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు. క్రీ.శ.1946లో చిత్రదుర్గంలో ప్రారంభమైన తరళుబాళు సిరిగేరి మఠం నేడు సమాజాభివృద్దికి తన వంతు కృషి చేస్తోందని కొనియాడారు. పీఠాధిపతి శివకుమార్‌ శివాచార్య స్వామీజీ మతసామరస్యానికి మరోపేరని తేల్చిచెప్పారు. మనది పురాతన ధర్మం. రుషిమునులు, శరణులు ఈ ధర్మరక్షణకు తమ జీవితాలను పణంగా పెట్టారని గుర్తు చేశారు. ధర్మరక్షణకు ప్రజలు వెనకాడవద్దని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ..విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మఠాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని నొక్కిపలికారు. కొద్దిసేపటికి వేదిక నుంచి గవర్నర్‌, కేంద్ర మంత్రి నిష్క్రమించారు. అనంతరం సీఎం బసవరాజ్‌ బొమ్మై మాట్లాడుతూ ప్రజలకు సంస్కారం, జ్ఞానం అందివ్వడంలో మఠాలు నిరంతర కృషి చేస్తున్నాయని కొనియాడారు. ఏటా ఓ జిల్లాలో ఉత్సవాలను ఏర్పాటు చేసినా ప్రజల్లో ధర్మ జాగృతి కల్పిస్తున్న తరళుబాళు మఠం అధిపతిని సీఎం అభినందించారు. కార్యక్రమంలో మాజీ సీఎం యడియూరప్ప, తరళుబాళు మఠం శివమూర్తి శివమూర్తి స్వామీజీ, అడ్వొకేట్‌ జనరల్‌ ప్రభులింగ నావడగి, ఎంపీ వై.దేవేంద్రప్ప, ఎమ్మెల్యే ఎన్‌.వై.గోపాలకృష్ణ, మాజీ మంత్రి హెచ్‌.ఆంజనేయ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కమహాదేవి జీవితచరిత్ర పుస్తకాన్ని విడుదల చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

పాల్గొన్న ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని