logo

బెళగావి.. భాజపా వశం

కుందానగరి.. బెళగావి మహానగర పాలికెలో కమలదళం పాగా వేసింది. మేయరుగా శోభా సోమన్నాచె, ఉప మేయరుగా రేష్మా పాటిల్‌ ఎన్నికయ్యారు.

Published : 07 Feb 2023 01:48 IST

బెళగావి నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్‌తో భాజపా ప్రముఖులు

బెళగావి, న్యూస్‌టుడే : కుందానగరి.. బెళగావి మహానగర పాలికెలో కమలదళం పాగా వేసింది. మేయరుగా శోభా సోమన్నాచె, ఉప మేయరుగా రేష్మా పాటిల్‌ ఎన్నికయ్యారు. పాలికెపై పట్టు సాధిద్దామని కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పాలికెలో 35 మంది కార్పొరేటర్లతో మెజార్టీ కన్నా ఎక్కువ స్థానాలున్న భాజపా అభ్యర్థుల గెలుపు ఏకగ్రీవమైంది. ఇక్కడ భాజపాకు 35, కాంగ్రెస్‌కు 10, స్వతంత్ర అభ్యర్థులు 13 మంది ఉన్నారు. మేయరు స్థానాన్ని జనరల్‌ (మహిళ), ఉప మేయరు స్థానాన్ని వెనుకబడిన వర్గం (మహిళ)కు కేటాయించారు. కొత్త కార్పొరేటర్లకు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిర్మల్‌ కుమార్‌ సురానా, ఎమ్మెల్యేలు అభయ్‌ పాటిల్‌, అనిల్‌ బెనక అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని