logo

మూగజీవుల రక్షణకు జనజాగృతి

మూగ ప్రాణులు, పెంపుడు జంతువులు, పక్షులు జీవించే హక్కులకు భంగం కలిగించకూడదంటూ వేగన్‌ ఇండియా మూవ్‌మెంట్ సంస్థల సభ్యులు నగరంలో శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు.

Published : 19 Mar 2023 02:13 IST

ఆందోళనలో పాల్గొన్న ‘వేగాన్‌’ సభ్యులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : మూగ ప్రాణులు, పెంపుడు జంతువులు, పక్షులు జీవించే హక్కులకు భంగం కలిగించకూడదంటూ వేగన్‌ ఇండియా మూవ్‌మెంట్ సంస్థల సభ్యులు నగరంలో శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. జయనగర వీధులలో కొనసాగిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రాణిప్రియులు పాల్గొన్నారు. వీధుల్లో మాంసాహారాన్ని ఇష్టం వచ్చినట్లు పడేయడం, సంతానోత్పత్తి చికిత్సల పేరిట తప్పుడు గణాంకాలను నమోదు చేయడంతో జాగిలాల సంఖ్య ఎక్కువైందని సంస్థ ప్రతినిధి రిచా అన్ని థామస్‌ తెలిపారు. కొందరు పశు ప్రవృత్తిని ప్రదర్శిస్తూ జాగిలాలకు విషాహారం పెట్టడం, వాటిపై వాహనాలు ఎక్కించి చంపడం దారుణమని ఖండించారు. దుస్తులు, ఆహారం, ఆనందం కోసం పశువులను హింసించే ప్రవృత్తిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆందోళనకారులు నినాదాలు రాసిన అట్టముక్కలు ప్రదర్శించారు. ఉదయం 10 నుంచి రాత్రి 7.30 వరకు ఈ సంస్థల ప్రతినిధులు వివిధ జాగృతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంస్థల ప్రతినిధులు నితిన్‌ జైన్‌, దిలీప్‌ కుమార్‌, సునీల్‌ కుమార్‌ తదితరులు జాతాకు నేతృత్వం వహించారు.

జంతురక్షణ నినాదాలు రాసిన అట్టలతో ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని