logo

Honey Trap: ‘నా భర్త దుబాయ్‌లో ఉంటున్నారు.. సరైన భాగస్వామి కోసం చూస్తున్నా’

నగరానికి చెందిన ఓ యువ పారిశ్రామికవేత్త (28) హనీట్రాప్‌లో పడ్డాడు. ఆమె, ఆమె తరపు వ్యక్తుల బెదిరింపులతో భయపడ్డాడు.

Updated : 21 Mar 2023 07:22 IST

నలుగురిపై కేసు నమోదు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: నగరానికి చెందిన ఓ యువ పారిశ్రామికవేత్త (28) హనీట్రాప్‌(Honey Trap)లో పడ్డాడు. ఆమె, ఆమె తరపు వ్యక్తుల బెదిరింపులతో భయపడ్డాడు. వారి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా పుట్టేనహళ్లి ఠాణా పోలీసులు మెహర్‌ అనే యువతితో కలిపి నలుగురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఆ మహిళ యువ పారిశ్రామికవేత్తకు పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ తరచూ చాటింగ్‌ చేసుకునేవారు. తన భర్త దుబాయ్‌లో ఉంటున్నారని, తాను లైంగిక తృప్తి కోసం సరైన భాగస్వామి కోసం చూస్తున్నానని అతనికి చెప్పింది. తన వద్దకు వచ్చి నీ కోరిక తీర్చుకోవాలని తన చిరునామా లొకేషన్‌ను పంపించింది. ఆమెపై ఆశతో వెళ్లి కలిశాడు. ఇద్దరూ ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతన్ని బెదిరించారు. నువ్వు సున్తీ చేయించుకోవాలని, ఆమెను వివాహం చేసుకోవాలని బెదిరించారు. తమ మాట వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు. వారి నుంచి తప్పించుకు వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని