logo

ఈ సినిమాకు ఇంతటితో తెర

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రవివాదానికి కారణమవుతున్న ‘ఉరిగౌడ- నంజేగౌడ’పై సినిమా చిత్రీకరణ విరిమించుకుంటున్నట్లు రాష్ట్ర ఉద్యాన వనాల శాఖ మంత్రి మునిరత్న వెల్లడించారు.

Published : 21 Mar 2023 02:02 IST

వెనక్కి తగ్గిన మునిరత్న

మఠాధిపతి డాక్టర్‌ నిర్మలానందనాథ్‌ స్వామితో చర్చిస్తున్న మునిరత్న

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రవివాదానికి కారణమవుతున్న ‘ఉరిగౌడ- నంజేగౌడ’పై సినిమా చిత్రీకరణ విరిమించుకుంటున్నట్లు రాష్ట్ర ఉద్యాన వనాల శాఖ మంత్రి మునిరత్న వెల్లడించారు. ఆయన సోమవారం ఇక్కడ ఆదిచుంచనగిరి మఠాధిపతి డాక్టర్‌ నిర్మూలానందనాథ స్వామితో సమావేశమయ్యారు. మఠాధిపతితో కలిసిన మాట్లాడిన తరువాత.. ‘ఆ సినిమా తీయడం లేదు’ అని ప్రకటించారు. ‘ఉరిగౌడ- నంజేగౌడ’ సినిమా కోసం దాఖలాలు అందుబాటులోకి వస్తున్నా.. ఎవరి మనస్సూ నొప్పించ దలచుకోలేదన్నారు. ‘ఈ సినిమాను ఇంతటితో ముగిస్తున్నా’ అని తేల్చిచెప్పారు. చిత్రీకరణ ఏమంత కష్టం కాదని, దాన్ని తెరకెక్కించి ఓ వర్గాన్ని నొప్పించే పని ఎందుకనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ‘ఉరిగౌడ- నంజేగౌడ’ సినిమా ఆలోచన విరమించుకోవాలని స్వామీజీ సూచించారని తెలిపారు. నిజానికి వారి చరిత్రపై పరిశోధనలు కొనసాగుతున్నాయని, కల్పిత కథల ఆధారంగా సినిమా తీయడం సాధ్యం కాదన్నారు. ‘నేను 25 సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నా. చివరి చిత్రం కురుక్షేత్రం’ అంటూ గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని