logo

నలుగురు వేటగాళ్ల అరెస్టు

కుందేళ్లను వేటాడుతున్న నలుగురిని అటవీశాఖాధికారులు అరెస్టు చేసి, వారి నుంచి చంపిన నాలుగు కుందేళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Published : 22 Mar 2023 02:49 IST

అటవీశాఖాధికారులు ఆధీనంలో వేటగాళ్లు, స్వాధీనం చేసుకున్న కుందేళ్లు, వలలు

బళ్లారి, న్యూస్‌టుడే: కుందేళ్లను వేటాడుతున్న నలుగురిని అటవీశాఖాధికారులు అరెస్టు చేసి, వారి నుంచి చంపిన నాలుగు కుందేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా బళ్లారి తాలూకా అటవీ ప్రాంతంలో వేటగాళ్లు కుందేళ్లు, ఇతర జంతువులను వేటాడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న బళ్లారి జిల్లా అటవీశాఖ ఉప సంరక్షణాధికారి సందీప్‌ సూర్యవంశీ ఆదేశాలతో అటవీశాఖాధికారి ఫయాజ్‌, రాఘవేంద్రయ్య, సిబ్బంది నాగరాజ్‌, రాజశేఖర్‌, అశోక్‌, గణేష్‌ తదితరులు దాడులు చేశారు. వేటాడుతున్న నలుగురిని అరెస్టు చేసి విచారణ చేయగా, చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు తాలూకా కోనపురం గ్రామానికి చెందిన రమేష్‌, రాజశేఖర్‌, పంపన్నగా గుర్తించారు. వారి నుంచి వేటాడిన నాలుగు కుందేళ్లు, 40కిపైగా వలలు, వేటాడటానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకుని న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని