logo

వేతనాలు విడుదల చేయాలని ధర్నా

సమాజ కల్యాణశాఖ ఆధీనంలో ఉన్న వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్ర సంయుక్త వసతి నిలయాల కార్మికుల సంఘం (ఏఐయూటీయూసీ) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

Published : 22 Mar 2023 02:49 IST

డీసీ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న ఆందోళనకారులు

బళ్లారి, న్యూస్‌టుడే: సమాజ కల్యాణశాఖ ఆధీనంలో ఉన్న వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్ర సంయుక్త వసతి నిలయాల కార్మికుల సంఘం (ఏఐయూటీయూసీ) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీసీ కార్యాలయం అధికారికి అందజేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలతో పాటు, మౌలిక సౌకర్యాలు కోసం కార్మికులు పలుమార్లు అందోళన చేసి మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆరోపించారు. వేతనాలు నెలనెలా సక్రమంగా ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు. ఏఐయూటీయూసీ జిల్లా అధ్యక్షుడు డా.ప్రమోద్‌, కార్యదర్శి సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని