logo

తల్లిని జేబు ఖర్చులడిగే రాహుల్‌తో నిరుద్యోగ భృతి అసాధ్యం

తల్లిని జేబు ఖర్చులకు అడిగే రాహుల్‌గాంధీ రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని గ్యారెంటీ ఇవ్వడం హాస్యాస్పదమని భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య ఎద్దేవా చేశారు.

Published : 22 Mar 2023 02:49 IST

గంగావతిలో భాజపా యువమోర్చా సమావేశం ప్రారంభిస్తున్న తేజస్విసూర్య

గంగావతి,న్యూస్‌టుడే: తల్లిని జేబు ఖర్చులకు అడిగే రాహుల్‌గాంధీ రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని గ్యారెంటీ ఇవ్వడం హాస్యాస్పదమని భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం గంగావతిలో భారతీయ జనతా యువమోర్చా సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్‌ యువతను ఆత్మాభిమానంతో బతకనివ్వదన్నారు. తమ కాళ్లపై నిలబడి జీవించే పథకాలను కాక నిరుద్యోగ ఉృతితో పరాన్నజీవులుగా మార్చుతున్నారన్నారు. రాహుల్‌ ఎక్కడా పనిచేసి జీతం తీసుకున్న దాఖలా లేదన్నారు. తల్లి ఇచ్చే జేబు ఖర్చులతో నెట్టుకొస్తున్నారన్నారు. నేటి యువత కష్టపడి పనిచేసి కుటుంబాలను పోషించే మనోభావాలు కలిగి ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డులను కన్నడిగులు నమ్మరాదన్నారు. ఇప్పటికే వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలను ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం, కేంద్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలుంటే ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. 2024లో మళ్లీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం రానుంది..రాష్ట్రంలో యువమోర్చా కార్యకర్తలు అంకితభావంతో కృషిచేసి శాసనసభ ఎన్నికల్లో భాజపా అధికారం చేపట్టేలా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారాయణస్వామి, శాసనసభ్యడు పరణ్ణ మునవళ్ళి, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు సందీప్‌కుమార్‌, ధడేసూగూరు బసవరాజ్‌, నెక్కంటి సూరిబాబు, గిరేగౌడ, తిప్పేరుద్రస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని