logo

చిత్ర పరిశ్రమకు కొత్త వెలుగు

కర్ణాటక రత్న పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. రేస్‌ కోర్సు రోడ్డుకు అంబరీశ్‌ పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Published : 24 Mar 2023 04:04 IST

కథారచయిత విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి జ్యోతి వెలిగిస్తున్న బొమ్మై

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కర్ణాటక రత్న పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. రేస్‌ కోర్సు రోడ్డుకు అంబరీశ్‌ పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విధానసౌధ మెట్లపై 14వ బెంగళూరు ఫిలిం ఫెస్టివల్‌ వేడుకలను గురువారం రాత్రి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది బెంగళూరులో అంతర్జాతీయ చిత్రోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశ, విదేశాలకు చెందిన చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కలుగుతుందని చెప్పారు. బెంగళూరులో చిత్ర పరిశ్రమకు కావలసిన సదుపాయాలన్నింటినీ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సినిమాలకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, డిజిటలీకరణ అయిన తర్వాత ఈ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. ‘కాంతార’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. ‘త్రిపుల్‌ ఆర్‌’ సినిమా ఆస్కార్‌ పురస్కారాన్ని దక్కించుకుందని, కన్నడ సినిమా కూడా ఆ పురస్కారాన్ని అందుకునే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కథారచయిత విజయేంద్ర ప్రసాద్‌, నటి సప్తమి గౌడ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, లోక్‌సభ సభ్యుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌, బాలీవుడ్‌ దర్శకుడు, సినిమాటోగ్రఫర్‌ గోవింద నిహలాని, నటి రమ్యకృష్ణ, నటులు అభిషేక్‌ అంబరీశ్‌, హర్షిక, ఫిలింఛాంబర్‌ అధ్యక్షుడు భా.మా.హరీశ్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని