logo

రూ.60 లక్షల నగదు స్వాధీనం

కొప్పళ నుంచి గంగావతికి కారులో తరలిస్తున్న రూ.60 లక్షల నగదును శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

Published : 26 Mar 2023 03:35 IST

వివరాలు వెల్లడిస్తున్న ఎ స్పీయశోధా వంటగోడి, పోలీస్‌ అధికారులు

గంగావతి, న్యూస్‌టుడే : కొప్పళ నుంచి గంగావతికి కారులో తరలిస్తున్న రూ.60 లక్షల నగదును శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను కొప్పళ ఎసీ యశోధా వంటగోడి వెల్లడించారు. కె.ఎ.37 ఎన్‌4323 నంబరు కారులో పెద్ద మెత్తంలో నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం తరలింపును అరికట్టేందుకు నియమించిన అధికారులు దాడిలో పాల్గొన్నారన్నారు. వాహనంలో రూ.500 నోట్ల కట్టలు రూ.60 లక్షలు గుర్తించామన్నారు. కారులో వెంకటేశ్‌ సింగనాళ, వీరభద్రప్ప పల్లేద్‌, విరుపాక్షగౌడ పాటిల్‌, చోదకుడు అబ్దుల్‌ రజాక్‌ అనే వ్యక్తులు ఉన్నారన్నారు. ఈఘటనపై గంగావతి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు. నగదు విషయంపై విచారణ చేయాలని ఆదాయ పన్నుల శాఖకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. దాడిలో డీవైఎస్పీ శేఖరప్ప, సీఐ మంజునాథ్‌, ఎస్సై సుజాతా, సిబ్బంది శివశరణ, సిద్దనగౌడ, మరియప్ప, బసవరాజ్‌, వెంకరెడ్డి పాల్గొన్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని