logo

కార్యాలయంలోనే ఉద్యోగి ఆత్మహత్య

కర్ణాటక ఖాదీ, గ్రామోద్యోగ మండలి కార్యాలయంలో సతీశ్‌ పాండు నాయక (42) అనే ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 26 Mar 2023 03:35 IST

కార్వార, న్యూస్‌టుడే : కర్ణాటక ఖాదీ, గ్రామోద్యోగ మండలి కార్యాలయంలో సతీశ్‌ పాండు నాయక (42) అనే ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి కార్వారలోని ఈ కార్యాలయంలోనే ఆయన ఉండిపోయారు. ఆపై.. ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని శనివారం ఉదయం గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలను గుర్తించలేదు. కార్వార పోలీసులు తెలిపారు.


కొండపై నుంచి దూకేసిన ప్రేమికులు

రామనగర, న్యూస్‌టుడే : తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో రామనగర బెట్టపై చేతన్‌ (19), సాహిత్య (19) అనే యువ ప్రేమికులు బలవన్మరణానికి ప్రయత్నించారు. వీరిద్దరూ బెంగళూరులోని కత్తరిగుప్పకు చెందిన వారు. బెట్టపై నుంచి కిందకు దూకిన సమయంలో మధ్యలో ఉన్న మరో పెద్దరాతిపై పడి వీరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమికంగా వారిద్దరికీ చికిత్స చేసి, రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు. చేతన్‌ స్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రామనగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు

పావగడ, న్యూస్‌టుడే:  పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక (7)పై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి సంధ్యారావ్‌ తీర్పు ప్రకటించారు. 2021 జులై 30న తమ్ముడితో కలిసి ఆ బాలిక చెరువు వద్ద ఆటాడుకునే సమయంలో పావగడకు సమీపంలోని యలగానకుంటకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి ఫలాల ఆశచూపి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణ అధికారి ఎస్‌.లక్ష్మికాంత్‌ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 376 కింద పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.ఎస్‌.ఆశా బాలిక తరఫున వాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని