logo

రూ.5.14 కోట్లతో రహదారి పనులు ప్రారంభం

దేశం మొత్తం ప్రగతి పథంలో దూసుకుపోతోంది, చక్కని రహదారుల నిర్మాణంతో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ తన కలను సాకారం చేసుకోగా, విశ్వమానవునిగా వినతికెక్కిన నేటి ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో భారత్‌ను అత్యుత్తమ స్థానానికి చేర్చారని కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ ప్రశంసించారు.

Published : 27 Mar 2023 02:24 IST

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు

సింధనూరు, న్యూస్‌టుడే : దేశం మొత్తం ప్రగతి పథంలో దూసుకుపోతోంది, చక్కని రహదారుల నిర్మాణంతో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ తన కలను సాకారం చేసుకోగా, విశ్వమానవునిగా వినతికెక్కిన నేటి ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో భారత్‌ను అత్యుత్తమ స్థానానికి చేర్చారని కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ ప్రశంసించారు. సింధనూరు తాలూకా రైతునగర్‌ క్యాంపులో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సింధనూరు నుంచి కురబ క్యాంపు వరకు ఉన్న ఎనిమిది కి.మీ. రైతు నగర్‌ క్యాంపు గ్రామీణ రహదారిని రూ.5.14 కోట్లతో తారు రోడ్డు పనులకు ఎంపీ సంగణ్ణ, ఎమ్మెల్యే నాడగౌడ, కపెక్‌ అధ్యక్షుడు కె.విరుపాక్షప్ప భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో నేడు అభివృద్ధి చెందుతున్న రహదారులు విమానాల రన్‌వే మాదరిగా ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే నాడగౌడ మాట్లాడుతూ ‘నా అయిదేళ్ల పాలనలో రెండేళ్లు కొవిడ్‌ కోసం పోయింది. మిగిలిన మూడేళ్లలో క్షేత్రంలో అనూహ్యమైన అభివృద్ధిని చూపించానని’ తెలిపారు. నాయకులు విరుపాపుర అమరేగౌడ, బసవరాజ్‌ నాడగౌడ, క్యాంపు పెద్దలు భాగ్యమ్మ, రామసుబ్బారెడ్డి, హరికిశోర్‌రెడ్డి, సాంబశివారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని