logo

హంపీ శిల్పకళాకారుడికి జక్కణాచారి పురస్కారం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హంపీ శిల్పకళా సౌందర్యాన్ని చూడగానే అందరికీ మహాశిల్ప కళాకారుడు జక్కణాచారి గుర్తొస్తారు. ‘శిలలపై శిల్పాలు చెక్కినారూ.. సృష్టికే అందాలు తెచ్చినారు.. అన్న పాటను నేటికీ ఎవరూ మరవలేదు.

Updated : 27 Mar 2023 06:43 IST

డి.హుసేని

హొసపేటె, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హంపీ శిల్పకళా సౌందర్యాన్ని చూడగానే అందరికీ మహాశిల్ప కళాకారుడు జక్కణాచారి గుర్తొస్తారు. ‘శిలలపై శిల్పాలు చెక్కినారూ.. సృష్టికే అందాలు తెచ్చినారు.. అన్న పాటను నేటికీ ఎవరూ మరవలేదు. రాష్ట్రంలో చాలా మంది శిల్పకళాకారులున్నారు. వారిలోని నైపుణ్యాన్ని గుర్తించి పురస్కారంతో గౌరవించాలని ప్రభుత్వ ఏటా శిల్పకళాకారులను ఎంపికచేసి వారికి జక్కణాచారి పురస్కారం అందిస్తోంది. అలాంటి పురస్కారం హంపీ వర్సిటీలోని ఉద్యోగి డి.హుసేన్‌కి దక్కింది. 56 ఏళ్ల హుసేన్‌లో నేటికీ ఆ శిల్పకళా నైపుణ్యం తగ్గలేదు. బెంగళూరు, మైసూరులాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిల్పకళా శిబిరంలో ఆయన పాల్గొని ప్రతిభ చాటారు. బెంగళూరులో జరిగిన శిల్పకళా శిబిరంలో ఆయన చెక్కిన బాపూజీ శిల్పం మన్ననలు పొందింది. అదే మాదిరి యక్షగాన కళాకారుడి శిల్పం ఆకట్టుకుంది. శిథిలావస్థకు చేరుకున్న హంపీ ఉగ్రనరసింహుడి రాతి ప్రతిమకు కొత్త రూపం ఇచ్చింది కూడా ఆయనే. అదే విధంగా బెలూరులోని పురాతన గోపురానికి కూడా హుసేని మెరుగులద్దారు. సాధారణ శిల్పకళాకారుడు హుసేనిలోని ప్రతిభను గుర్తించి ప్రభుత్వం 2020-21వ సంవత్సరానికి గాను జక్కణాచారి పురస్కారానికి ఎంపిక చేసింది. కళాకారుడిని వర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని