logo

రాహుల్‌గాంధీపై చర్యలు అమానుషం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై తీసుకున్న చర్యలను ఖండిస్తూ ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీక్‌ నేతృత్వంలో ఆదివారం స్థానిక కంటోన్మెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.

Published : 27 Mar 2023 02:24 IST

ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీక్‌ 

బళ్లారి, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై తీసుకున్న చర్యలను ఖండిస్తూ ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీక్‌ నేతృత్వంలో ఆదివారం స్థానిక కంటోన్మెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నేతృత్వంలో పార్టీ నేతలు కల్లుకంబ పంపాపతి, అల్లం ప్రశాంత్‌, వెంకటేశ్‌ హెగ్డె, గుర్రం వెంకటరమణ, కాంతి నెహ్రూ విల్సన్‌, ఆయాజ్‌ అహమ్మద్‌, ఈరణ్ణగౌడ, హర్షద్‌ అహమమద్‌ గని, రవికుమార్‌, తాయప్ప, నాగరాజ్‌, పద్మ, విష్ణువర్ధన్‌ తదితరులు మొదట గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మౌనంగా ఆందోళన నిర్వహించారు. రాహుల్‌గాంధీకి భారత్‌ జోడ్‌ యాత్రలో ప్రజలు నుంచి వచ్చిన స్పందనతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు కష్టంగా కాలం ప్రారంభమైందని, దీంతోనే లేని పోని కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నాయకులు శివరాజ్‌, బసవరాజ్‌, ప్రదీప్‌, ఖండ్ర సతీష్‌, సోమప్ప, రామరాజ్‌, బాబు, శివకుమార్‌, ఆసీఫ్‌, ఎర్రిస్వామి వివేక్‌కుమార్‌, రాజేశ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని