logo

నేడు బంజారు సముదాయం సమావేశం

ఎస్సీ వర్గీకరణపై న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకూడదు, దీనిపై బంజార సముదాయం సోమవారం బెంగళూరులో సమావేశం నిర్వహించి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తామని బంజార గిరిజన సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి రామునాయక్‌ అన్నారు.

Published : 27 Mar 2023 02:24 IST

మాట్లాడుతున్న బజార గిరిజన సమాఖ్య జాతీయ
ప్రధాన కార్యదర్శి రామునాయక్‌, పక్కన నాయకులు

బళ్లారి, న్యూస్‌టుడే : ఎస్సీ వర్గీకరణపై న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకూడదు, దీనిపై బంజార సముదాయం సోమవారం బెంగళూరులో సమావేశం నిర్వహించి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తామని బంజార గిరిజన సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి రామునాయక్‌ అన్నారు. ఆదివారం ఉదయం బళ్లారి నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జస్టిస్‌ నాగమోహన్‌దాస్‌ నివేదిక ప్రకారం ఎస్సీలకు 15 నుంచి 17 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని మంత్రి మండలి సమావేశంలో ఆమోదించారన్నారు. నేటికీ రిజర్వేషన్లు అందడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై తయారీ చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే బంజార సముదాయం ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే మంత్రి ప్రభు చౌవ్హాణ్‌తో పాటు శాసనసభ్యుడు రాజీవ్‌తో చరవాణిలో మాట్లాడినట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు చంప చౌవ్హాణ్‌, గోపినాయక్‌, రామునాయక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని