logo

మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికపై సుదీర్ఘ చర్చ

బళ్లారి నగర పాలికె మేయర్‌, ఉపమేయర్‌, నాలుగు స్థాయి సమితి అధ్యక్ష ఎన్నిక మార్చి 29న జరగనుంది. దీనిపై జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లతో పార్టీ నేతలు సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు.

Updated : 27 Mar 2023 06:40 IST

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగేంద్ర, అల్లం వీరభద్రప్ప, మేయర్‌ రాజేశ్వరి,
డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీక్‌, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆంజినేయులు

బళ్లారి, న్యూస్‌టుడే : బళ్లారి నగర పాలికె మేయర్‌, ఉపమేయర్‌, నాలుగు స్థాయి సమితి అధ్యక్ష ఎన్నిక మార్చి 29న జరగనుంది. దీనిపై జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లతో పార్టీ నేతలు సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. బళ్లారి నగర మేయర్‌ ఎస్సీ జనరల్‌, ఉప మేయర్‌ ఎస్టీ మహిళకు రిజర్వేషన్‌ కేటాయించారు. మేయర్‌ రేసులో త్రివేణి, ఉమాదేవి, లత, శిల్ప, కుబేర, మించు శ్రీనివాసులు ఉండగా, ఉపమేయర్‌ రేసులో శశికళ, రత్న, జానకమ్మ ఉన్నారు. తొందరలో విధానసభ ఎన్నికలు జరుగుతుండటంతో మేయర్‌, ఉపమేయర్‌ అభ్యర్థిని ఏకపక్షంగా ఎన్నిక చేస్తే కార్పొరేటర్లు మధ్య బేధాభిప్రాయాలొస్తే విధానసభ ఎన్నికలకు కష్టమవుతుందని పార్టీ నేతలు భావించి జాగ్రత్తలు పడ్డారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన 21 కార్పొరేటర్లు, స్వతంత్ర కార్పొరేటర్లుగా గెలుపొంది కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లుతో మొత్తం 26 మంది కార్పొరేటర్లుతో శనివారం సాయంత్రం బళ్లారి నగర శివారు ప్రాంతమైన అల్లం భవనంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, ఏఐసీసీ సభ్యుడు, మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప, డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీక్‌, మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, ఉపమేయర్‌ మాలన్‌ బీ, కె.పి.సి.సి ప్రధాన కార్యదర్శి జె.ఎస్‌.ఆంజినేయులు పాల్గొని మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికపై కార్పొరేటర్లు నుంచి అభిప్రాయాలు సేకరించారు.

ఎమ్మెల్యే జాగ్రత్తగా ముందుకు..

గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర మాత్రం జాగ్రత్తగా తనపై ఆరోపణలు రాకుండా చూసుకున్నారు. మొదటి విడత మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి ఎంపికపై గ్రామీణ శాసనసభ్యుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. మేయర్‌ ఇస్తామని ఆసీఫ్‌ నుంచి డబ్బులు తీసుకున్నారని కేసు నమోదు కావడంతో, ముస్లిం కార్పొరేటర్లు మొదట్లో వ్యతిరేకించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడ్డారు. గ్రామీణ విధానసభ క్షేత్రం వ్యాప్తిలోకి వచ్చే 11 వార్డులకు గాను, 10వ వార్డుల్లో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు గెలుపించుకున్నట్లు తెలిపారు. మేయర్‌కు ఆరుగురు కార్పొరేటర్లు అర్హులుగా ఉన్నారు. ఆరుగురు కార్పొరేటర్లు మేయర్‌ అభ్యర్థి ఎంపికపై సమాలోచన చేసి ఓ నిర్ణయానికి వస్తే నిర్దారిస్తామని నేతలు కార్పొరేటర్లపైనే భారం వేశారు. మరో సారి సోమవారం సమావేశం నిర్వహిస్తాం అంతలోపుల ఓ నిర్ణయానికి రావాలని సమావేశం ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని