logo

ఐటీబీటీకి మెట్రో పరుగు

నమ్మ మెట్రో రైలు సంచారం నూతనంగా కె.ఆర్‌.పురం నుంచి వైట్‌ఫీల్డ్‌ వరకు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది.

Published : 27 Mar 2023 02:24 IST

మెట్రో బోగీలో ప్రయాణిస్తున్న ప్రజలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: నమ్మ మెట్రో రైలు సంచారం నూతనంగా కె.ఆర్‌.పురం నుంచి వైట్‌ఫీల్డ్‌ వరకు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. మెట్రో రైల్లో సంచరించేందుకు ఐటీ బీటీ ఉద్యోగులు ఉత్సాహం చూపించారు. ఉదయం 7 గంటలకు వైట్‌ఫీల్డ్‌ స్టేషన్‌ నుంచి రైలు సంచారం ప్రారంభమైంది. తొలిగా టిక్కెట్‌ తీసుకుని ప్రయాణించిన 50 మంది ప్రయాణికులకు బీఎంఆర్‌సీఎల్‌ సిబ్బంది గులాబీ పువ్వులను అందజేసి స్వాగతం పలికారు.7.21 నిమిషాలకు కె.ఆర్‌.పురం స్టేషన్‌కు రైలు చేరుకుంది. అక్కడ దిగిన ప్రయాణికులకు బయ్యప్పనహళ్లి మెట్రో స్టేషన్‌ వరకు వెళ్లేందుకు బీఎంటీసీ ఫీడర్‌ బస్సులను నడిపింది. వైట్‌ఫీల్డ్‌లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మెట్రో రైల్లో సంచరించి ఆయా స్టేషన్లలో దిగి వస్తువులు కొనుగోలు చేశారు. తొలిరోజు సాయంత్రం ఐదు గంటల వరకు 55వేల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. నిత్యం సంచార రద్దీ నుంచి బయటపడ్డామని ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెట్రో తమకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు. మిగతా పనులు పూర్తి చేస్తే నేరుగా ఎంజీరోడ్డు, విధానసౌధ, కబ్బన్‌పార్కు, మెజిస్టిక్‌ సంచరించే వాళ్లమని తెలిపారు. సోమవారం వేకువన ఐదుగంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైలు సంచారం ఉంటుందని అధికారులు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని