logo

ప్రజా సహకారంతో అవినీతి అంతం

ప్రతి చోటా అవినీతిని అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని లోకాయుక్త విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సంతోశ్‌ హెగ్డే పిలుపునిచ్చారు.

Published : 30 Mar 2023 01:33 IST

సంస్థ ప్రతినిధులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించి ప్రదర్శిస్తున్న జస్టిస్‌ సంతోశ్‌ హెగ్డే

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రతి చోటా అవినీతిని అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని లోకాయుక్త విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సంతోశ్‌ హెగ్డే పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తాము చేయవలసిన పనికి లంచం అడిగితే తక్షణమే లోకాయుక్త సంస్థకు ఫోన్‌ చేసి లేదా ఇ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. చిక్కబళ్లాపురలో మానవహక్కుల సమితి, అవినీతి వ్యతిరేక దళాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజలలో జాగృతి కల్పిస్తే, అవినీతిపరుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. జాగృతి దళం సభ్యులను సంస్థ అధ్యక్షుడు శంకర్‌, ఇతర ప్రతినిధులు సత్కరించారు.  కార్యక్రమంలో సమితి ప్రతినిధులు ఎంయూ మహ్మద్‌ రఫీ, టీఆర్‌ కృష్ణప్ప, మోహన్‌ కుమార్‌, విశ్వనాథ్‌, సుధాకర్‌, నందిని, స్వాతి, సుజాత, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని