logo

ప్రమాదకర స్థితిలో ప్రజాస్వామ్యం

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అపాయకరమైన స్థితికి వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌ శర్శ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 30 Mar 2023 01:33 IST

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అపాయకరమైన స్థితికి వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌ శర్శ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో తొలిసారిగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేసి గొంతు నొక్కారని ఆక్రోశం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రస్తుత అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా పాలక పక్షం సభ్యులు అడ్డుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ లేవనెత్తిన ప్రశ్నలు భాజపాను నిద్రలేకుండా చేశారని, పార్లమెంట్‌లో అంశాలు చర్చకు రాకుండా సమావేశాలు సక్రమంగా జరగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. లండన్‌లో చేసిన వ్యాఖ్యానాలకు సమాధానం ఇచ్చేందుకు రాహుల్‌గాంధీ సిద్ధపడినా.. అందుకు స్పీకర్‌ అవకాశం ఇవ్వలేదన్నారు. గతంలో అనేక సమస్యలు, కుంభకోణాలపై పార్లమెంట్‌ సంయుక్త సమితులను జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ నరసింహరావు, మన్‌మోహన్‌సింగ్‌, తదితరులు వేశారని గుర్తు చేశారు. అదాని సంస్థలను గురించి అధ్యయనం చేసేందుకు ఎందుకు సమితి ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఏ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని కించపరిచే విధంగా మాట్లాడలేదని, క్రిమినల్‌ చర్యలకు పాల్పడలేదని, ఏవర్గాన్ని రెచ్చకొట్టలేదని, దేశాన్ని దోచుకుని విదేశాలకు పరారైన వ్యక్తుల గురించి మాట్లాడితే ఆయనకు న్యాయస్థానం శిక్ష విధించిందన్నారు. దీని వెనక పెద్దకుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు