logo

నీటమునిగి నలుగురు బాలల మృతి

జిల్లాలో వేర్వేరు చోట్ల నీట మునిగి నలుగురు విద్యార్థులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

Updated : 30 Mar 2023 06:32 IST

చిత్రదుర్గం, న్యూస్‌టుడే: జిల్లాలో వేర్వేరు చోట్ల నీట మునిగి నలుగురు విద్యార్థులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హొళల్కెరె తాలూకా హొరకెరేదేవపురలోని ఓ ప్రైవేటు కళాశాలలో ద్వితీయ పీయూసీ చదువుతున్న నలుగురు విద్యార్థులు మధ్యాహ్నం నందనహోసూరు గ్రామం వద్ద ఉన్న గుండిచెరువులో ఈతకు వెళ్లారు. హొరకెరేదేవపురానికి చెందిన సంజయ్‌(18), నందనహోసూరు గొల్లరహట్టి గ్రామానికి చెందిన టి.గిరీశ్‌(18), కణివేజ్యోగిహళ్లి గ్రామానికి చెందిన టి.ఎస్‌.మనోజ్‌(18)లు చెరువులో ఈతకు దిగగా మరో విద్యార్థి జీవన్‌ చెరువు గట్టుపై కూర్చొని చరవాణిలో వీడియో తీయసాగాడు. నీటిలో మునిగిన ముగ్గురు పైకి రాకపోవడంతో జీవన్‌ ఫోన్‌ చేేయడంతో ప్రజలు, తోటి స్నేహితులు అక్కడికి చేరుకొని నీటిలోకి దిగి ఇద్దరిని బయటకు తీయగా అప్పటికే ప్రాణాలు వదిలారు. అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలించి సాయంత్రం మరో విద్యార్థి శవాన్ని వెలికితీశారు. తోటి విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. వీరు బుధవారం చివరి పరీక్ష సోషియాలజీ రాయలవలసి ఉంది.


*మరో సంఘటనలో ఇదే తాలూకా హొన్నేకెరెలో ఈతకెళ్లిన 9వ తరగతి విద్యార్థి బీఎన్‌ శశాంక్‌(15) నీట మునిగి మృతిచెందాడు. మంగళవారం ఉదయం పరీక్ష రాసి ఇంటికి వచ్చిన విద్యార్థి మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈతకెళ్లాడు. ఈ దృశ్యాలను చరవాణిలో బంధించాలని తెలిపి చెరువులోకి దూకిన వాడు తిరిగి పైకి రాలేదని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని