logo

రాజకీయ పార్టీ నేతలు సహకరించాలి : డీసీ

విధానసభ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి వివిధ పార్టీ నేతలు అధికారులతో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి, జిల్లా పంచాయతీ సీఈవో, స్వీప్‌ సమితి అధ్యక్షుడు రాహుల్‌ శరణప్ప సంకనూర కోరారు.

Published : 30 Mar 2023 01:33 IST

మాట్లాడుతున్న డీసీ పవన్‌కుమార్‌ మాలపాటి, జడ్పీ సీఈవో రాహుల్‌ శరణప్ప సంకనూర తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే : విధానసభ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి వివిధ పార్టీ నేతలు అధికారులతో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి, జిల్లా పంచాయతీ సీఈవో, స్వీప్‌ సమితి అధ్యక్షుడు రాహుల్‌ శరణప్ప సంకనూర కోరారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా పాలనాధికారి కార్యాలయంలో వివిధ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలు సభలు, సమావేశాలు తదితర అనుమతులు పొందడానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించి అనుమతి తీసుకోవాలన్నారు. పోటీ చేసిన అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతా ప్రారంభించి వాటి వివరాలను నామపత్రంతో జత చేసి అందజేయాలన్నారు. నిత్యం ఎన్నికల ఖర్చుల వివరాలు ఇవ్వాలన్నారు. ఘర్షణలు, తదితర ఘటనలు జరిగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసమావేశంలో కాంగ్రెస్‌, భాజపా. జేడీఎస్‌, వామపక్షాలు తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని