హంద్యాళు ఆరోగ్య క్షేమ కేంద్రానికి కాయకల్ప పురస్కారం
గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపించే అంటువ్యాధుల నివారణకు, ఇతర ఆరోగ్య సేవలను నియంత్రణ కోసం ఆరోగ్య క్షేమ కేంద్రంలో మెరుగైన చికిత్స అందజేసిన బళ్లారి తాలూకా హంద్యాళు ఆరోగ్య...
హంద్యాళు ఆరోగ్య, క్షేమ కేంద్రంలో విధులు నిర్వహించే వైద్యులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఆరోగ్య సిబ్బంది
బళ్లారి, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపించే అంటువ్యాధుల నివారణకు, ఇతర ఆరోగ్య సేవలను నియంత్రణ కోసం ఆరోగ్య క్షేమ కేంద్రంలో మెరుగైన చికిత్స అందజేసిన బళ్లారి తాలూకా హంద్యాళు ఆరోగ్య, క్షేమ కేంద్రం రాష్ట్ర స్థాయి ‘కాయకల్ప పురస్కారానికి’ ఎంపికైందని జిల్లా ఆరోగ్య, కుటుంబ కల్యాణశాఖాధికారి డా.హెచ్.ఎల్.జనార్దన్ తెలిపారు. జిల్లాలో మొదటిసారిగా ఆరోగ్య క్షేమ కేంద్రాన్ని కాయకల్ప పురస్కారం వరించిందన్నారు. భవిష్యత్తులో రోగులకు మరింత మెరుగైన సేవలు అందజేస్తామన్నారు. తాలూకాలోని కొర్లగొంది ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోకి వచ్చే హంద్యాళు ఆరోగ్య క్షేమ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మేరి మేనికా బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత సాధించారు. ఆమె సకాలంలో విధులకు హాజరు కావడం, గ్రామీణ రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల బృందాలు ఆకస్మికంగా ఆరోగ్య క్షేమ కేంద్రాన్ని పరిశీలించి పురస్కారానికి ఎంపిక చేశారు. జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్ మాలపాటి ఆరోగ్య క్షేమ కేంద్రంలో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. సముదాయ ఆరోగ్య అధికారి మేరి మోనికా, ప్రాథమిక ఆరోగ్య సురక్షాధికారి సువర్ణ, ఆరోగ్య రక్షణాధికారి నీలకంఠప్ప, కొర్లగొంది ప్రాథమిక కేంద్రం వైద్య అధికారి డా.నౌసీన్ మరియం, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందిని డా. జనార్దన్ అభినందించారు. కార్యక్రమంలో డా.పూర్ణిమ కట్టిమని, జిల్లా సర్వేక్షణాధికారి డా.మరియంబీ, తాలూకా ఆరోగ్యశాఖాధికారి డా.మోహనకుమారి, ఆరోగ్య, శిక్షణాధికారి ఈశ్వర్ దాసప్పనవర్, అధికారులు నాగవేణి, డా.జబీనా తాజ్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Ap-top-news News
Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు