logo

కరగపైనా ఎన్నికల నిబంధనలు

శతాబ్దాల చరిత్ర ఉన్న బెంగళూరు కరగ ఉత్సవాలు గురువారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 6న ఉత్సవాలకు తెరపడనుంది.

Published : 31 Mar 2023 03:11 IST

కబ్బన్‌ ఉద్యానంలో పూజ చేస్తున్న జ్ఞానేంద్ర స్వామి

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : శతాబ్దాల చరిత్ర ఉన్న బెంగళూరు కరగ ఉత్సవాలు గురువారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 6న ఉత్సవాలకు తెరపడనుంది. ధర్మరాయ స్వామి ఆలయం అర్చకుడు జ్ఞానేంద్ర స్వామి ఈ ఏడాది కూడా కరగ ఉత్సవాలకు నేతృత్వం వహించనున్నారు. ఎన్నికల నియమావళి ఉన్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఉత్సవాలలో పాల్గొన్నప్పటికీ వేదికపైకి రాకూడదని ఎన్నికల కమిషన్‌ అధికారులు స్పష్టం చేశారు. తమ పార్టీ చిహ్నాలను ఈ ఉత్సవాలలో ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ద్రౌపదిదేవి కరగ శక్తోత్సవం, ధర్మరాయ స్వామి రథోత్సవాలు ఏప్రిల్‌ 6 చైత్ర పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 3న హారతి దీపం, నాలుగున హసి కరగ, 5న హొంగలు సేవ, ఆరున ధర్మరాయస్వామి రథోత్సవం ఉంటాయి. కరగ పూర్తయిన తర్వాత దేవాలయంలో ఏడో తేదీన గావు శాంతి, 8న వసంతోత్సవం, ధ్వజారోహణ ఉంటాయని జ్ఞానేంద్ర స్వామి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని