logo

క్యాన్సర్‌ చికిత్సతో చక్కని ప్రయోజనం

పీనియల్‌ గ్లాండ్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌ (పీనియలో బ్లాస్టోమా)తో సమస్యను ఎదుర్కొంటున్న బెంగళూరులో ఉంటున్న వెంకట శ్రీశరవణ వేముల (12) అనే బాలుడికి ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ చక్కని ప్రయోజనాన్ని ఇచ్చింది.

Published : 31 Mar 2023 03:11 IST

చికిత్స చేయించుకున్న బాలునితో కుటుంబ సభ్యుడు, వైద్యులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : పీనియల్‌ గ్లాండ్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌ (పీనియలో బ్లాస్టోమా)తో సమస్యను ఎదుర్కొంటున్న బెంగళూరులో ఉంటున్న వెంకట శ్రీశరవణ వేముల (12) అనే బాలుడికి ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ చక్కని ప్రయోజనాన్ని ఇచ్చింది. దక్షిణ ఆసియా ఖండంలో ఈ తరహా చికిత్స ఇదే మొదటిదని సంబంధిత విషయ నిపుణులు వివరించారు. పీనియల్‌ గ్లాండ్‌కు వచ్చిన కణితితో నిద్ర పట్టేందుకు కావలసిన మెలటోనిన్‌ హార్మోను స్రావం సరిగా విడుదల కాదు. నిద్రలేమితో పాటు, ఇతర సమస్యలకు ఇది దారి తీస్తుంది. చెన్పైలోని అపోలో ప్రోటాన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలోని ఆంకాలజీ విభాగానికి చెందిన వైద్యుడు సీహెచ్‌ శ్రీనివాస్‌ వద్ద 2019 నుంచి నాలుగు విడతలలో చికిత్స చేయించగా కణితి పూర్తిగా కరిగిపోయిందని బాలుని తండ్రి సతీశ్‌ కుమార్‌ గురువారం బెంగళూరులో వెల్లడించారు. ఈ సేవలను బెంగళూరు పరిధిలోనూ అందుబాటులోకి తీసుకు వస్తామని సంస్థ ప్రతినిధి దినేశ్‌ మాధవన్‌ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 3.3 లక్షల మంది బాలలు వివిధ క్యాన్సర్ల బారిన పడుతుండగా, సకాలంలో చికిత్సలను చేయించుకోకపోవడంతో వారు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారని ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీస్‌ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని