logo

జనసంద్రం నడుమ జోడు రథోత్సవం

హొసపేటె తాలూకా మరియమ్మన హళ్లిలో గురువారం సాయంత్రం లక్ష్మీనారాయణ, ఆంజనేయ స్వామి జోడు రథోత్సవం భక్తజనసంద్ర నడుమ కనులపండువగా జరిగింది.

Published : 31 Mar 2023 03:11 IST

మరియమ్మన హళ్లిలో జనసంద్రం నడుమ లక్ష్మీనారాయణ, ఆంజనేయ స్వామి జోడు రథోత్సవం

హొసపేటె, న్యూస్‌టుడే: హొసపేటె తాలూకా మరియమ్మన హళ్లిలో గురువారం సాయంత్రం లక్ష్మీనారాయణ, ఆంజనేయ స్వామి జోడు రథోత్సవం భక్తజనసంద్ర నడుమ కనులపండువగా జరిగింది. పట్టణ వీధిలో భక్తులు ఎంతో శ్రద్ధగా రథాన్ని లాగారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని ఉగాది పండుగ మరుసటి రోజు నుంచి ఆలయంలో పలు ధార్మిక కార్యక్రమాలు, పూజాకైంకర్యాలు ఆరంభమయ్యాయి. ఏటా రామనవమిలోనే స్వాములవారి జోడు రథోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోందని ఆలయం ప్రముఖులు తెలిపారు. మరియమ్మన హళ్లి, డణాపుర, హనుమన హళ్లి, దేవలాపుర, వెంకటాపుర, గరగ, నాగలాపుర నుంచి పెద్దఎత్తున భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని