logo

శ్యామనూరు పాత్ర ఏంటి?

విధానసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు వంట పాత్రలను పంచుతున్న ఆరోపణలపై దావణగెరెలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఎస్‌ఎస్‌ మల్లికార్జున్‌పై కేటీజే నగర ఠాణాలో కేసు నమోదైంది.

Published : 31 Mar 2023 03:21 IST

శివశంకరప్ప

దావణగెరె, న్యూస్‌టుడే : విధానసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు వంట పాత్రలను పంచుతున్న ఆరోపణలపై దావణగెరెలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఎస్‌ఎస్‌ మల్లికార్జున్‌పై కేటీజే నగర ఠాణాలో కేసు నమోదైంది. ఆయన తండ్రి, మాజీ మంత్రి శామనూరు శివశంకరప్ప ఈ కేసులో మొదటి నిందితుడని ఎస్పీ సీబీ రిష్యంత్‌ వెల్లడించారు. శివశంకరప్ప, మల్లికార్జున్‌ చిత్రాలు ఉన్న బాక్సులను భగత్‌సింగ్‌ నగరలో పంచేందుకు తీసుకు వచ్చి- ఒక చోట నిలువ ఉంచారని వచ్చిన ఫిర్యాదులతో బుధవారం రాత్రి దాడి చేసి స్వాధీనపరుచుకున్నారు. రూ.7.19 లక్షల విలువైన కుక్కర్లు, చీరలు, వంట సామగ్రిని స్వాధీనపరుచుకున్నామని పోలీసులు తెలిపారు. భాజపా కార్యకర్త కాడజ్జి హనుమంతప్ప ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. తాము ఎవరికీ ఉపకరణాలు, చీరలను పంచలేదని దావణగెరె దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లికార్జున్‌ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అమలులోకి రాక మునుపు, ఉగాది సమయంలో తమ అభిమానులు వాటిని పంచి ఉంటారని పేర్కొన్నారు. లేదా భాజపా నాయకులే కుట్ర పూరితంగా తమ చిత్రాలు ముద్రించి వీటిని పంపిణీ చేసి ఉండవచ్చని ఆరోపించారు. తనపై లోక్‌సభ సభ్యుడు జీఎం సిద్ధేశ్వర్‌ పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాలు విసరారు. నేనైతే ఎన్నికల ప్రచార సభలకు సన్నాహాలు చేసుకుంటున్నానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని