logo

పది పరీక్షలకు సర్వం సిద్ధం

విద్యార్థి జీవితంలో ప్రముఖ ఘట్టంగా చెప్పే పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

Updated : 31 Mar 2023 05:31 IST

బెంగళూరులోని ఓ పాఠశాలలో ఏర్పాట్లు ఇలా

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : విద్యార్థి జీవితంలో ప్రముఖ ఘట్టంగా చెప్పే పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు 5833 ప్రభుత్వ పాఠశాలలు, 3605 ప్రభుత్వం నుంచి నిధులు అందుకుంటున్న, 6060 ప్రైవేటు ప్రాఠశాలలకు చెందిన 8.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 3.60 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. పరీక్షల కోసం 3305 కేంద్రాలను సిద్ధం చేశారు. శుక్రవారం ప్రథమ భాష కన్నడ, హిందీ, తెలుగు, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్లంఉన్న విద్యార్థులు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.45 వరకు పరీక్ష రాస్తారని కర్ణాటక పాఠశాలల పరీక్ష మండలి ప్రకటించింది. జిల్లా, తాలూకా కేంద్రాలలోని ఖజానాకు ప్రశ్న పత్రాలను పంపించారు. పరీక్ష సమయానికి గంట ముందుగా ఆయా కేంద్రాలకు వాటిని తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 15 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఏప్రిల్‌ 3న గణితం, ఏప్రిల్‌ 6న ద్వితీయ భాష, ఏప్రిల్‌ 10న సైన్సు, ఏప్రిల్‌ 12న తృతీయ భాష, ఏప్రిల్‌ 15న సోషల్‌ స్టడీస్‌ పరీక్షలుంటాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, పరీక్ష ఉన్న రోజులలో తమ హాల్‌టిక్కెట్లను చూపించి, బీఎంటీసీ, ఆర్టీసీ బస్సు సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని