logo

‘ప్రజాస్వామ్యానికి పెనుముప్పు’

ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్న మతతత్వ శక్తులకు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పి తీరాలని సీపీఎం నేతలు రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు.

Published : 31 Mar 2023 03:21 IST

ప్రసంగిస్తున్న ఎం.ఎ.బేబి.. వేదికపై నాయకులు బీవీరాఘవులు, బసవరాజు తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్న మతతత్వ శక్తులకు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పి తీరాలని సీపీఎం నేతలు రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు. బాగేపల్లి విధానసభ నియోజకవర్గంలో ఆ పార్టీ రాజకీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అభ్యర్థి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎం పాలిట్‌ బ్యూరో సభ్యులు ఎం.ఎ.బేబి, బీవీ రాఘవులు తదితరులు ప్రసంగించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను వ్యాపారవేత్త అదానీకి గుట్టు చప్పుడు కాకుండా కట్టపెడుతున్నారని, అదానీతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న సంబంధాలను నిలదీసిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ గొంతు నొక్కి లోక్‌సభ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. విధానసభలో పీడిత ప్రజల గొంతు వినిపించేందుకు డాక్టర్‌ అనిల్‌కుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి యు.బసవరాజు, కార్యదర్శి మండలి సభ్యులు కె.ప్రకాశ్‌, ఎం.పి.మునివెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభకు ముందు పుచ్చపల్లి సుందరయ్య భవన్‌ నుంచి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని