logo

నమామి.. రామం భజే!

రాజధాని నగర సిటీ మార్కెట్ సమీపంలోని కోటె హైస్కూలు ఆవరణలో శ్రీరామ సేవా మండలి నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకలలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొన్నారు.

Published : 31 Mar 2023 03:29 IST

బృందావనం వద్ద బొమ్మై, సుధామూర్తి తదితరులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : రాజధాని నగర సిటీ మార్కెట్ సమీపంలోని కోటె హైస్కూలు ఆవరణలో శ్రీరామ సేవా మండలి నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకలలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొన్నారు. ఉత్సవాలు తొమ్మిది రోజులు కొనసాగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా సంగీత ఉత్సవాలను బొమ్మై ప్రారంభించారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధామూర్తి, మాజీ ముఖ్యమంత్రి బొమ్మై తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సందడి అంతా అక్కడే..

మెజెస్టిక్‌ సమీపంలోని పాతాళ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రథంపై ఉన్న రాముల వారి విగ్రహాన్ని వానర సేనతో ఆంజనేయుడు ముందుకు లాగారు. కొంతసేపు వానరసేన యుద్ధం చేస్తున్నట్లు, కిష్కిందలో అల్లరి చేస్తున్న ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వాహనదారులకు ఈ వేషధారులు జాగృతి కల్పించారు. భక్తులకు పానకం, మజ్జిగను వితరణ చేశారు. గత ఐదు దశకాలుగా పాతాళ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ తరహా ఉత్సవాలను నిర్వహించుకుంటూ వస్తున్నామని ఆలయ ప్రతినిధులు తెలిపారు.

మెజిస్టిక్‌లో రథం వద్ద వానరసేన గదాయుద్ధ ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని