logo

నవోదయ తరహా పాఠశాలలు ఏర్పాటుకు కృషి

రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ తరహా పాఠశాలలను ప్రారంభించే ఆలోచన ఉందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వెల్లడించారు.

Published : 30 May 2023 02:47 IST

తన గురువు డాక్టర్‌
కె.పి.గోపాలకృష్ణను కలిసిన ఉప ముఖ్యమంత్రి డీకేశివకుమార్‌

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ తరహా పాఠశాలలను ప్రారంభించే ఆలోచన ఉందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వెల్లడించారు. సోమవారం తనకు చదువు చెప్పిన గురువు రాజాజీనగరలో ఉన్న నేషనల్‌ పబ్లిక్‌ స్కూల్‌ (ఎన్‌పీఎస్‌) అధ్యక్షుడు డాక్టర్‌ కె.పి.గోపాలకృష్ణను కలిసి ఆశీర్వవాదం పొందారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో గ్రామ పంచాయతీ స్థాయిలో నవోదయ తరహా పాఠశాలలను ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. పాఠశాలలు ప్రారంభించేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక సమితి అధ్యక్షుడు డాక్టర్‌ పరమేశ్వర్‌, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధుబంగారప్పలతో కలిసి చర్చిస్తానని తెలిపారు. దీన్ని అమలు ఏడాదిలోగా చేయడం సాధ్యం కాదన్నారు. దశలవారీగా అమలులోకి తెస్తామన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన చదువు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని