logo

అలరించిన నాట్యమయూరాలు

 ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ   పాశ్చాత్య సంస్కృతివైపు ఆకర్షితులవుతున్న యువతకు  నృత్యోత్సవాలు కనువిప్పుకావాలని తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డా.ఎ.రాధాకృష్ణరాజు అన్నారు.

Published : 30 May 2023 02:47 IST

నృత్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డా.ఎ.రాధాకృష్ణరాజుతదితరులు

బెంగళూరు (న్యూస్‌టుడే) సాంస్కృతికం, న్యూస్‌టుడే :  ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ   పాశ్చాత్య సంస్కృతివైపు ఆకర్షితులవుతున్న యువతకు  నృత్యోత్సవాలు కనువిప్పుకావాలని తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డా.ఎ.రాధాకృష్ణరాజు అన్నారు. ఆదివారం రాత్రి తెలుగు విజ్ఞాన సమితి ఆడిటోరియంలో భావార్ణవ అనే సుందర నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ నాట్య శాస్త్రంలో అత్యున్నత సాహిత్య సంగీతాలు మిళితమై ఉన్నాయన్నారు. నృత్యోత్సవంలో ప్రఖ్యాత కూచిపూడి నర్తకీమణి, తెలుగు విశ్వవిద్యాలయ నృత్య విభాగాధిపతి అలేఖ్య పుంజాల, బెంగళూరు నర్తకి వీణామూర్తి, కళాకారిణి స్వప్నసుందరి తదితర కళాకారిణులు తమ సుందర హావభావాలు, నృత్యాభినయాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వేదిక్‌ వెల్‌నెస్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి జి.కృష్ణమూర్తి మాట్లాడారు. అనంతరం నృత్య కళాకారిణులను ముఖ్యఅతిథులు సత్కరించి అభినందించారు. వీణామూర్తి, అలేఖ్య, మధులితామహాపాత్రో, నిరుపమ తదితర నృత్యకళాకారిణులు తమ నాట్యంతో అలరించారు.

వీణామూర్తి హావభావాలు 

నిరుపమా రాజేంద్ర

మధులితా మహాపాత్రో

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని